Puffer Fish: మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు.