ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్ లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. కాగా కేకేఆర్ తో మ్యాచ్ కోసం వార్నర్ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం( ఏప్రిల్ 16 ) ఢిల్లీకి చేరుకుంది.