Different Weather: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఉదయం ఎండ చంపుతుంటే, సాయంత్రం వర్షం పడుతుంది. ఆ వెంటనే విపరీతమైన చలి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయట అడుగుపెట్టడానికి భయపడి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల, రెంటచింతల ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో కూడా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఓవైపు ఎండలు మరోవైపు వడగాలులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక, మరో మూడు రోజులపాటు ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండకు…