Vijayawada: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రుల నాలుగో రోజు సాయంత్రం 5 గంటల వరకు 66 వేల 300 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం, ప్రసాదం, ఇతర సేవల ద్వారా 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ తెలిపారు.