Vijayawada: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రుల నాలుగో రోజు సాయంత్రం 5 గంటల వరకు 66 వేల 300 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం, ప్రసాదం, ఇతర సేవల ద్వారా 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ తెలిపారు. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మరో 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
READ MORE: Gunda Prakash Rao: వరంగల్ నగర మాజీ మేయర్ అరెస్ట్.. ఎందుకంటే?
ఇక వీఐపీ దర్శనాలపై ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అసహనం వ్యక్తం చేశారు. “వీఐపీలు ప్రోటోకాల్ సమయాలను ఇప్పటికే మార్చాం. కానీ కొంతమంది ఇచ్చిన సమయాల్లో కాకుండా వేరే సమయంలో వస్తున్నారు. అందరూ విఐపిల మాదిరిగా వస్తే కొండపై వాహనాలకు స్థలం ఉండదు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. కాబట్టి వీఐపీలు కచ్చితంగా కేటాయించిన స్లాట్లలోనే రావాలి. ఇవ్వని సమయాల్లో వస్తే మేము తాళాలు వేసుకుని ఛాంబర్‌లో కూర్చుంటాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడమే మా ప్రధాన లక్ష్యం” అని ఈవో స్పష్టం చేశారు.
READ MORE: Hyderabad Metro: కీలక పరిణామం.. హైదరాబాద్ మెట్రో నుంచి తప్పుకున్న ఎల్ ఎండ్ టి..