Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.