Darsini Movie: వికాస్ జికే, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దర్శిని. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది.