Darsini Movie: వికాస్ జికే, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దర్శిని. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో మేకర్స్.. స్టూడెంట్స్ మీద ఫోకస్ చేశారు. నేడు దర్శిని మూవీ టీమ్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్ లో యూత్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించాం అని, ముఖ్యంగా థ్రిల్లర్ ప్రేక్షకులని ఈ చిత్రం బాగా అలరిస్తోంది అని అన్నారు. నిర్మాత డా.ఎల్వీ సూర్యం మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక హీరో వికాస్.జి.కే మాట్లాడుతూ “యూత్ తలుచుకుంటే ఏదయినా సాధిస్తారు, మా సినిమా పోస్టర్ లుక్ నుండి, సాంగ్స్, టీజర్ వరకు ప్రేక్షకులకు నచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, సినిమా రిలీజ్ వరకు మాకు మీ సపోర్ట్ ఉండాలని” తెలిపాడు. అనంతరం హీరో జికె వికాస్, హీరోయిన్ శాంతి ప్రియ,సత్యప్రసాద్ ప్రేక్షకులను వారి మాటలతో, డ్యాన్స్‌లతో అలరించి, స్టూడెంట్స్ కి ఉత్సాహం రేకెత్తించారు. స్టూడెంట్స్ అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని ఆనందం వ్యక్తపరిచారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ కుమార్ అన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.