ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఏజెంట్ల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
Off The Record: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం.. ఏపీలోనే కాస్ట్‌లీయస్ట్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల వరకు గ్రానైట్ కింగ్‌లే రెండు పార్టీల తరఫున బరిలో నిలిచేవారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్య పరిణామాల కారణంగా గ్రానైట్ నేపథ్యం లేని మద్దిశెట్టి వేణుగోపాల్, కదిరి బాబూరావులు వైసీపీ, టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఫ్యాను గాలిలో మద్దిశెట్టి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కదిరి బాబూరావు నియోజకవర్గానికి ముఖం చాటేసి… కొన్నాళ్లకు…
ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సమయంలో కలిసి సాగిన నేతలు ప్రస్తుతం చెరోదారి అయ్యారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయబోనని బూచేపల్లి చెప్పడంతో మద్దిశెట్టికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. ఆ సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ.. తర్వాతే మార్పు వచ్చింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. బ్యానర్లు చించివేత, శిలాఫలకాల ధ్వంసం.. పార్టీ ఆఫీసులపై దాడి.. కరపత్రాల పంపిణీ…
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి ఎన్నికలు ముగిసినా ఇంకా ఉత్కంఠ తీరడంలేదు. దర్శి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యతను కనబరిచిన టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందా? టీడీపీ కౌన్సిలర్స్ లో చీలిక కు వైసీపీ ప్రయత్నం చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక జరగబోయే సోమవారం ఏం జరగబోతోంది? రెండుదఫాలుగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తాడిపత్రి, కొండపల్లి, దర్శిలో ఆధిక్యతను సాధించింది. దర్శిలో మొత్తం 20…
ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియలో 8వ వార్డు ఉపసంహరణ విషయంలో మొదటినుండి హై డ్రామా నడిచింది. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నాడని వైసీపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవంగా ప్రకటించారు. 8వవార్డులో తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ తరుపున పోటీ చేశారు. ఉపసంహరణలో…