ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు యోగి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్…