హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ ల, FSSAI Act అమలు తో పాటు అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయడం పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్…
వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని, ఒకటి రెండు ఏళ్లలో స్థిరమైన మార్పులు కనిపిస్తాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఅర్ కిట్ లో మార్పులు.. ప్రతి 35 కిలోమీటరు కి ఒక ట్రామ సెంటర్, కొత్తగా 75 ట్రమా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డయగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 3 రకాల టాస్క్ ఫోర్స్ ను…
బలగం మొగులయ్య తీవ్ర అస్వస్థకు గురైన సమాచారం తెలుసుకొని తక్షణం స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ బలగం మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని అధికారులకు అదేశించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మొగులయ్యకు వరంగల్ లోని సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స ను అందిస్తున్నారు జిల్లా వైద్య శాఖ అధికారులు. బలగం సినిమా లో నటించి ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న నటుడు, బుడగ జంగాల కళాకారుడు బలగం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సమాచారం…
సంగారెడ్డి జిల్లాలోని కంకోల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని దసరా నాటికి పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్‌లో పిహెచ్‌సికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ.. 8నెలల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించి పిహెచ్‌సిని నిర్వహిస్తామన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పెద్ద చెల్మడ గ్రామంలో రూ.4.35 కోట్లతో నూతన జిల్లా…
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు తెలంగాణ మంత్రి దామోదర రాజ నర్సింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడాం.. సుప్రీంకోర్టు కు హాజరై వాదనలు విన్నాం.. వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్…
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోనీ తన కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం ముఖ్య అంశాలు: COVID-19 కొత్త వేరియంట్ JN 1 అంత ప్రమాదకరం కాదు. గతంలో వచ్చిన కోవిడ్ లో ఇది ఒక భాగం. కోవిడ్ లక్షణాలైనా సాధారణ జ్వరం , ముక్కు కారడం, గొంతు నొప్పి ఆయాసంతో పాటు…
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించాం.. అన్ని హస్పటల్స్ లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.