వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని, ఒకటి రెండు ఏళ్లలో స్థిరమైన మార్పులు కనిపిస్తాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఅర్ కిట్ లో మార్పులు.. ప్రతి 35 కిలోమీటరు కి ఒక ట్రామ సెంటర్, కొత్తగా 75 ట్రమా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డయగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 3 రకాల టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణ ( క్లినికల్ ఎస్టాబ్లిష్ ) అని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్మా మెడికల్ కోసం (డ్రగ్స్ నియంత్రణ ) ఫుడ్ క్వాలిటీ కోసమని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని, మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి అని ఆయన అన్నారు. మెడికల్ ప్రొఫెషన్ స్లో గా పెరగాలన్నారు. కేసీఆరే డాక్టర్ అయ్యాడు… కేసీఆరే ఇంజనీర్ అయ్యాడని ఆయన సెటైర్లు వేశారు. కరోనా కు పారాసిటామాల్ అన్నారు.. కాళేశ్వరం ఆయన్నే డిజైన్ చేశారన్నారు.
హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం 9 వేల కోట్ల రూపాయలు లోన్ రూపంలో తీసేసుకున్నారని, 21 అంతస్తుల నుంచి 14 అంతస్తులకు తగ్గించామన్నారు దామోదర రాజనర్సింహ. వైద్య రంగంలో రెగ్యులేటరీ పవర్స్ అమలు చేద్దామన్నారు దామోదర రాజనర్సింహ. గత ప్రభుత్వ తీరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు తెలిపారు. సిద్దిపేట ఆస్పత్రిపై దృష్టి పెట్టీ.. ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోలేదని, పదేళ్లు పాలించి కనీసం ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా కట్టలేదన్నారు. సిటికి పక్కనే ఉన్న మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఎందుకు ఇచ్చారో తెలియదన్నారు దామోదర రాజనర్సింహ. ఇంజనీరింగ్ కాలేజీల మాదిరిగా మెడికల్ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.