రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోనీ తన కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశం ముఖ్య అంశాలు:
COVID-19 కొత్త వేరియంట్ JN 1 అంత ప్రమాదకరం కాదు. గతంలో వచ్చిన కోవిడ్ లో ఇది ఒక భాగం. కోవిడ్ లక్షణాలైనా సాధారణ జ్వరం , ముక్కు కారడం, గొంతు నొప్పి ఆయాసంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఉంటే ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేసుకోవాలి. చిన్నపిల్లలకు పెద్ద వయసు ఉన్న ఇతర దీర్ఘకాలిక రోగాలు, వ్యాధి నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు కోవిడ్ సోకే అవకాశం ఉంది. కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. కోవిడ్ రాకుండా ఉండేందుకు జనసందోహంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి.
*కోవిడ్ సంబంధ లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్ ల సలహాలు తీసుకోవాలి.
*అనుమానం ఉంటే కోవిడ్ టెస్టులు RAT (rapid antigen test) , or RT – PCR ( Real-time reverse transcriptase-polymerase chain reaction ) టెస్టులు తప్పనిసరిగా చేసుకోవాలి.
*కొత్త వేరియంట్ కోవిడ్ వల్ల మరణాల శాతం తక్కువగా ఉంది.
* జీనోమ్ టెస్ట్ ల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది.
*వారిలో ఇతరత్రా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి మాత్రమే జబ్బు తీవ్రత అధికంగా ఉంది.
*ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు.
*కరోనా పై వస్తున్న వదంతులను నమ్మవద్దు. వదంతులను ప్రచారం చేయవద్దు.
*ప్రభుత్వం కరోనా కట్టడికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.
*కోవిడ్ పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయి.
*ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.
*బెడ్ల కొరత లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది.
*ఇప్పటివరకు ఎలాంటి మరణం నమోదు కాలేదు.
*నిన్న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన రెండు మరణాలలో కూడా దీర్ఘకాలిక రోగాలైన గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండడం వల్ల మరణాలు సంభవించాయి.
*పాజిటివ్ వచ్చిన ఇద్దరు చిన్న పిల్లల్లో ఒకరు జన్యుపరమైన గుండెజబ్బుతో బాధపడుతున్న వ్యక్తి చనిపోవడం జరిగింది.
*మిగతా వారందరూ త్వరగా కోలుకుంటున్నారు. త్వరలో వారిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.
ఈ సమీక్ష లో DME డాక్టర్ త్రివేణి, TSMSIDC ఎండి చంద్రశేఖర్ రెడ్డి, NIMS డైరెక్టర్ బీరప్ప, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.