ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల మధ్య వార్ కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అందరూ వైసిపి కార్పొరేటర్లే అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.