తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటలపాటు దళిత బంధుపై చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన…