ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తిరిగి లేని మెజార్టీని కమలం పార్టీ అందుకుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఈ విషయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.