సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…