ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తింస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్నవారికి రైతు బంధు వచ్చినట్టే.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు.. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. ఆ…
హుజూరాబాద్ సీఎం సభ స్థలిని పరిశీలించారు మంత్రులు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అంతా ఒకేసారి జరుగుతుంది. మా జాతి బిడ్డల్లో చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోంది. హుజూరాబాద్ కోసమే 2 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. కాబట్టి ఆందోళన చెందకండి.. అందరికీ దళిత బంధు వస్తుంది. మొదట రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే నిందలు వేశారు. ఇక ఇప్పుడు దళిత బంధు కూడా అందరికీ ఇచ్చి…
కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో దళితులు ధర్నా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. కాగా, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ…
దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్…
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం రూపొందించినట్లు తెలంగాణ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…
దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తామని వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లబ్ధి దారుడు తను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి…