TS Dalit Bandhu: గాంధీ జయంతి రోజే దళితబంధు.. ప్రారంభించనున్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Dalit Bandhu: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం. వెనుకబడిన దళితులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం, రెండో విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 162 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారు. మొదటి విడత పంపిణీలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు భారీగా కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రెండో విడతలో భాగంగా అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో 50 వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో 38,323 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. అందుకోసం 4,441.80 కోట్లు వెచ్చించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరయ్యాయి. రెండో దశలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా 1,30,000 కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 72 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. లబ్ధిదారుల జాబితాలను త్వరితగతిన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి చేరవేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Harish Rao vs Perni Nani: తెలంగాణ మంత్రి హరీష్ రావు పై.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!