Business Headlines 07-03-23: పేటీఏం-ఏపీ ఒప్పందం: పేటీఎం సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఆరోగ్యం మరియు సైబర్ భద్రత వంటి రంగాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల నుంచి మరియు వ్యాపార సంస్థల నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తాయి. టోల్ ప్లాజాలు సైతం ఈ ఆన్‌లైన్ పేమెంట్లను తీసుకుంటాయి.