మేషం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలిస్తాయి. ధనమూలక సమస్యలను ధీటుగా…