డిసెంబర్ 16, బుధవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలిస్తాయి. ధనమూలక సమస్యలను ధీటుగా ఎదుర్కుంటారు. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. బంధుమిత్రుల ఆంతర్యాన్ని ఆలస్యంగా గ్రహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
మిథునం : ఈ రోజు ఈ రాశివారు వృత్తి ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటుకాగలదు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి, ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, పనిభారం అధికం. వాహనం నడుపునపుడు జాగ్రత అవసరం.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి భాగస్వామిక చర్చల్లో అపశృతులు దొర్లే ఆస్కారం ఉంది. ఈడొచ్చిన మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. బంధువుల రాకతో అనుకోని ఖర్చులు, పెరిగిన అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. రాజకీయ విషయాల పై ఆసక్తి కనబరుస్తారు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మీలో మంచి మార్పును తెస్తాయి. ఏ పని మొదలెట్టినా ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరగలవు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. రాజకీయనాకులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం నిదానంగా నడపటం శ్రేయస్కరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. బంధువుల రాకతో ప్రయాణాలు విరమించుకుంటారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు యత్నాలు గోప్యంగా సాగించాలి. విద్యార్థులకు టెక్నికల్, కంప్యూటర్ సైన్సు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే యత్నంలో ఏజెంట్లు, బ్రోకర్లతో జాగ్రత్త అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి మనస్పర్థలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు. ప్రముఖుల ఇంటర్వ్యూల వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు. విదేశీ చదువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు. ప్రయాణాలు ఆలస్యం వల్ల పనులు వాయిదా పడతాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికం అవుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. వస్తు, వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతర కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నిర్మాణపనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. నిరుద్యోగుల నిర్లిప్త ధోరణి వల్ల సదవశాలు జారవిడుచుకుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, చిరు వ్యాపారులకు శుభదాయకం.
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!