ప్రదీప్ రంగనాథ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ టుడే’ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళనాడులో 70 కోట్ల వరకూ రాబట్టిన ఈ మూవీ, తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. యంగ్ లవర్స్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో వారి ఫోన్స్ ని మార్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇద్దరికీ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది లవ్ టుడే సినిమా కథ కథనం. యూత్ కి బాగా…