కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.…