ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు.…