నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం పైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో తుఫాన్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఆరేబియా సముద్రంలో మరో ఆరు గంటల్లో తుఫాన్ ఏర్పడబోతుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్ తీరం మరియు ఈశాన్య ఆరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని.. అది కాస్తా 6 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Meghalaya Landslide : మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీని ప్రభావంతో నలుగురు చనిపోయారు. ఇందులో 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.
Cyclonic Circulation: భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మే 6 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ మంగళవారం తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్‌కాస్ట్ మోడల్ గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రెంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని తర్వాత ఐఎండీ కూడా…
వరుస వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టమే జరిగింది.. నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. మరో తుఫాన్ తీరంవైపు దూసుకొస్తోంది.. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.. అది రేపటికి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ – ఒడిశా తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు… ఈనెల 3వ తేదీన అది తుఫాన్‌గా మారుతుందని.. ఆ తర్వాత 24 గంటల్లో…
యాస్ తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది… వాయుగుండం తీవ్రమై ఇవాళ ఉదయం 05.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ ఏర్పడినది. ఉదయం 08.30 గంటలకు పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మరియు తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం…