పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటలో తీవ్ర వాయుగుండంగా బలపడి "రేమాల్" తుఫాన్ గా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. "రేమాల్" తీవ్ర తుఫాన్ గా మారి ఈనెల 27వ తేదీన అర్థరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు రెమల్‌గా నామకరణం చేశారు. రుతుపవనాల రాకకు ముందుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. అయితే ఈ తుఫాన్‌తో ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదు.