మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా…
మంత్రి నారా లోకేష్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మొంథా తుపానుకు సంబంధించి కేంద్రంతో సమన్వయ బాధ్యతలను లోకేష్‌కు సీఎం చంద్రబాబు అప్పగించారు. తుపానుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యలతో పాటు తుఫాన్ ప్రారంభం అయ్యే ముందు పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలన్నారు. హోర్డింగ్స్ విషయంలో కూడా తగిన చర్యలు…
‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావం మొదలైంది. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లతో సహా స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. Also Read: Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో…
‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈరోజు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముంది. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాన్ ప్రభావం ఇప్పటికే కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం పూర్తిగా మారింది. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో నెల్లూరులోని ఉదయగిరి-కావలి ప్రాంతాలలో తేలికపాటి వర్షం మొదలైంది. తుమ్మలపెంట సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.…
కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో…
‘మొంథా’ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత…