తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్‌లోన్ వల్ల పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు పరిహారం అందించనున్నారు… సంబంధిత రైతుల ఖాతాల్లో 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న…
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం.. నల్లటి మేఘాలతో చిమ్మ చీకటిగా హైదరాబాద్ నగరం మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే రాత్రి వాతావరాణాన్ని తలపించింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరద నీరు భారీగా చేరుకొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నిర్మల్, నిజామాబాద్,…