సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్, బాలానగర్, మేడ్చల్ జోన్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలను పట్టుకున్నారు. నాలుగు జోన్ల పరిధిలో 1060 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో, ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకున్నారు. CEIR పోర్టల్ ల్లో సెల్ ఫోన్ లను పోగొట్టుకొని నమోదు చేసుకున్న వారికి తిరిగి ఫోన్లను అందజేశారు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్.సి. నాయక్.
Also Read:IPL 2025: మాకు యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు.. సీఎస్‌కే విజయాల బాట పడుతుంది: రుతురాజ్
సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్.సి. నాయక్ మాట్లాడుతూ.. మొత్తం ఐదు టీమ్ లు పగలు, రాత్రి కష్టపడి ఫోన్ లను రికవరీ చేశారు.. ఫోన్ పోగొట్టుకున్న బాధ, బాధితులకు మాత్రమే తెలుస్తుంది.. ఎన్నో కుటుంబాలు సెల్‌ఫోన్ పోగొట్టుకొని నలిగిపోతున్నాయి.. సెల్‌ఫోన్ పోతే ఎలా రిపోర్ట్ చేయాలో కూడా ఎవరికి తెలియడం లేదు.. సీఈఐఆర్ పోర్టల్ ను కేంద్రం ఆధునీకీకరించింది.. ఇప్పటి వరకు 9505 ఫోన్ లను అన్ బ్లాక్ చేశాము.. 18 లక్షల రూపాయల విలువైన సెల్‌ఫోన్‌లను రికవరీ చేశాము.. నిత్యావసర వస్తువులలో సెల్‌ఫోన్ ఒకటిగా మారిపోయింది.. కాబట్టి సెల్‌ఫోన్‌లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
Also Read:KTR: హెచ్‌సీయు భూముల విషయంలో అతి పెద్ద కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
2000 సంవత్సరంలో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ ల్లో నమోదు చేసుకోవాలి.. నిర్లక్ష్యం వహిస్తే పోగొట్టుకున్న సెల్‌ఫోన్ తో మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు విత్ డ్రా చేస్తారు.. గూగుల్ పే, ఫోన్ పే లకు సంబంధించిన పాస్‌వార్డ్‌లను ఫర్గెట్ పాస్‌వార్డ్ తో మారుస్తున్న దొంగలు.. అలా మార్చుకున్న పాస్‌వార్డ్ తో డబ్బులు విత్ డ్రా చేస్తున్న దొంగలు.. సెల్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.. సంచార్ సాతి అనే వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ కొడితే మన నెంబర్ పై ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుస్తుంది… ఎన్ని ఫోన్ లు మన ఆధార్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో తెలుస్తుంది.. వీటిల్లో మీవి కానివాటిని తొలగించుకుంటే మోసాలకు గురికాకుండా ఉండొచ్చని సూచించారు.