Chiranjeevi : చిరంజీవిపై అసభ్య పోస్టులు.. రెండు కేసులు నమోదు
- చిరంజీవిపై అసభ్య పోస్టులపై సైబర్ పోలీసుల దర్యాప్తు
- రెండు కేసులు నమోదు, 25 పోస్టులు గుర్తింపు
- డిప్ ఫేక్ ఘటనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- సైబర్ క్రైమ్ బాధితులు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు : డీసీపీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : సోషల్ మీడియాలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, డిప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డీసీపీ కవిత మీడియాతో మాట్లాడారు. డీసీపీ కవిత వివరాల ప్రకారం.. చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసామన్నారు. 25 పోస్టులకు పైగా గుర్తించామని, వాటిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ వీడియోలు, పోస్టులు ఎక్కువగా ‘ఎక్స్’ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో ట్రెండ్ అవుతున్నాయి అని ఆమె పేర్కొన్నారు.
Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ ?
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అంతేకాకుండా.. చిరంజీవి ఈ ఘటనపై సివిల్, క్రిమినల్ రెండు మార్గాల్లో ముందుకు వెళ్తున్నారని డీసీపీ కవిత తెలిపారు. చిరంజీవి సివిల్ కోర్టుకు వెళ్ళారన్నారు. క్రిమినల్ కంప్లైంట్ ఆధారంగా మేము కేసులు నమోదు చేశామని, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందిస్తూ సహాయం అందిస్తున్నామని చెప్పారు. డిప్ ఫేక్ టెక్నాలజీని కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ మోసం, బ్లాక్‌మెయిల్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు. “డిప్ ఫేక్ ఘటనలు చిన్నవి కావు. ఇవి మోసం చేయడం, బ్లాక్‌మెయిల్ చేయడం కోసం వాడుతున్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేసి నోడల్ ఏజెన్సీకి పంపించాం,” అని డీసీపీ కవిత స్పష్టం చేశారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌పై అపోహలు పెట్టుకోవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ఎవరైనా సైబర్ నేరాల బాధితులుగా మారితే వెంటనే 1930 నంబర్‌కి లేదా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించవచ్చు. తక్షణ చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు. డిప్ ఫేక్ కంటెంట్ పెరుగుతున్న తరుణంలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఫేక్ వీడియోలు షేర్ చేయకూడదని డీసీపీ కవిత సూచించారు.
Traffic Rules : హైదరాబాద్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇక కుదరదు నాయనా..!
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..