ఓ వర్గం మహిళలను టార్గెట్ చేస్తూ.. బుల్లి బై పేరుతో ఉన్న ఓ యాప్ విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఈ యాప్ ఆగడాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు.. ఇక, ముంబైలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళలు సింగిల్‌గా ఉన్న ఫొటోలను తీసుకుని.. వాటిని ఈ యాప్‌లో అమ్మకానికి పెట్టడం.. వాటిని వేలం వేయడమే బుల్లి బై యాప్…
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ట్విట్టర్ లో ఓ యాడ్ చూసి.. 14 లక్షల సైబర్ మోసానికి ఓ యువకుడు బలైపోయాడు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కి చెందిన రాహుల్ ను ట్విట్టర్ లో ఓ యాడ్ ఆకర్షించింది. నీల్ పటేల్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ యాడ్ చూసి.. అధిక లాభాలు వస్తాయని 14 లక్షల క్రిప్టో కరెన్సీ…
తన బ్యాంక్ అకౌంట్ నుండి 1.2 కోట్లు మాయం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. హైదరాబాద్ ఖైరతాబాద్ కి చెందిన ఓ కుటుంబం సభ్యులైన నలుగురు పేరుతో బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసారు. కుటుంబంలోని అమ్మ నాన్న సోదరుడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జాయింట్ అకౌంట్ లో ఉన్న 2 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసుకునే ప్రయత్నం లో ఉంది ఆ మహిళ. ఇంతలోనే 1.2 కోట్లరూపాయలు…
విశాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసును చేధించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు.. డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేశారు.. వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్‌ఎంఎస్‌లు మెసేజ్ పంపించి ఎర వేశారు.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసింది మహిళ.. ఇక, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. డబ్బులు ఇవ్వకపోతే…