తాజాగా నిజామాబాద్ జిల్లాలో లోన్ యాప్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. నవిపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి లోన్ యాప్ నుంచి ఏజెంట్లు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని సదరు వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు.
కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది.. కొత్త యాప్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మారుతున్న కాలంతో పాటు నేరం కూడా కొత్త రూపం దాల్చడం మొదలైంది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు ప్రత్యక్షంగా మీ దగ్గరకు లేదా మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మీకు సంబంధించిన వివరాలు తెలిస్తే చాలు.. ఒక్క లింక్ మీ ఫోన్ కు పంపడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్…
ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు సిద్దమయ్యారు.
Anasuya: హాట్ యాంకర్ అనసూయ అనుకున్నది సాధించింది. ఎవరైనా నా జోలికి వస్తే వారి అంతు చూస్తా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన అమ్మడు అన్నంత పని చేసింది. తన ఫొటోలతో పాటు హీరోయిన్ల ఫోటోలను ఫేక్ అకౌంట్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఆకతాయిలపై అనసూయ సీరియస్ అయ్యింది.
Jeevitha Rajashekar: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. పెట్టుబడులు పేరిట, ఇతర వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్ల లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. వాటిని నమ్మి అమాయకులు మోసపోతున్నారు. ఇక తాజాగా సినీ నటి జీవితా రాజశేఖర్ సైతం సైబర్ వలలో చిక్కుకుంది.
మోసం చేసేవాడు ఎప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉంటాడు.. రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టి.. బిచానా ఎత్తేసేవారు ఇప్పుడు ఎంతో మంది తయారయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మోసం వెలుగుచూసింది.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 6 కోట్ల మేరం మోసం చేశారు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా ఈ మోసానికి పాల్పడ్డారు.. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారని పోలీసులు చెబుతున్నమాట.. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు…
సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. అవకాశం దొరికితే ప్రతిష్టాత్మక సంస్థలను కూడా వదలడంలేదు.. తాజాగా, హైదరబాద్ కంచన్‌బాగ్ లోని మిధాని సంస్థకు రూ. 40 లక్షలు టోకరా వేశారు సైబర్ క్రైమ్ నేరస్థులు… మిథాని సంస్థ.. కెనడాకు చెందిన నేచురల్ ఆలూ కంపెనీ దగ్గర నుంచి అల్యూమినియం కొనుగోలు చేసింది.. అయితే, అల్యూమినియం కొనుగోలుకు మిథాని సంస్థ కొంత నగదును అడ్వాన్స్ గా చెల్లించింది… నేచురల్ అలూ కంపెనీ ఒప్పందం ప్రకారం మిథాని సంస్థకు అల్యూమినియం అందించింది……
Anasuya: జబర్దస్త్ కామెడీ షోతో పాటు పలు టీవీ షోలు, సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనుంది. ట్విట్టర్‌లో తనను పలువురు ‘ఆంటీ’ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. తనను మానసిక వేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరనుంది. ఈ మేరకు శనివారం సాయంత్రంలోగా అనసూయ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ…
శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరాటే కల్యాణి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన హిందూ సంఘం ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై హిందువులంతా ఏకమై న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 100 కోట్ల మంది హిందువుల దైవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు…