China Great Green Wall: ఎడారిలో పచ్చదనం కనిపిస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా.. కానీ చైనా శాస్త్రవేత్తలు దానిని నిజం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎడారులను పచ్చగా మార్చడానికి చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వాయువ్య చైనాలో శాస్త్రవేత్తలు ప్రత్యేక నీలి-ఆకుపచ్చ ఆల్గే (సైనోబాక్టీరియా)ను వ్యాప్తి చేసి పచ్చదనాన్ని సృష్టించే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఆల్కే అనేది దీర్ఘకాలం వేడి, కరువును తట్టుకోగలదని చెబుతున్నారు. ఇది వర్షాకాలంలో వేగంగా పెరుగుతుంది,…