నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ…