హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా…