US-Venezuela: వెనిజులా చమురు విక్రయాలను తామే నియంత్రిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా ఖాతాల్లోనే ఉంచుతామని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ అన్నారు. వెనిజులాకు చెందిన అత్యంత విలువైన వనరైన చమురును ప్రపంచ మార్కెట్‌లోకి ఎలా తీసుకురావాలనే దానిపై అమెరికా క్లారిటీ ఇచ్చింది.