మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. టెక్ దిగ్గజం యొక్క సర్వర్‌లలో లోపం తరువాత.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.