CM Chandrababu: మాజీ మంత్రి వివేకా హత్యకేసు మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు.
రాజకీయాలు పూర్తి కలుషితం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం మీడియాతో మాట్లాడారు. నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్న ఈ నేరస్థులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికల ముందు మోసపోయానని.. ఎప్పుడూ నేను నేరం చేశానా.. హత్య రాజకీయాలు చేశానా..? అని ప్రశ్నించారు.