ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న జాబితాలో ఇమ్రాన్‌ఖాన్ పేరు లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నేరారోపణలు ఉండడంతో ఆయనను పోటీ నుంచి యూనివర్సిటీ తప్పించింది.
పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక నేరస్థుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసుకుని.. ఓ నేరస్థుడు ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు.
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్‌తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు…
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.
Tanish: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు తనీష్. బాలనటుడిగా తన ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు హీరోగా చేశాడు కానీ, అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి.