Parking: ఇటీవల కాలంలో పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు భౌతికదాడుల వరకు వెళ్తున్నాయి. తాజాగా న్యూ ఇయర్ రోజు పార్కింగ్ వాగ్వాదం ఒకరి మరణానికి కారణమైంది. ఘజియాబాద్‌లోని మోడీ నగర్‌లో పార్కింగ్ వివాదంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎస్‌యూవీ కార్‌తో 30 ఏళ్ల వ్యక్తిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Insurance Money: డబ్బుల కోసం స్నేహితుడినే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు ఫ్రెండ్‌ని చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చోటు చేసుకుంది. చెన్నైలో తన పేరిట ఉన్న రూ.1 కోటి ఇన్సూరెన్స్ డబ్బును పొందేందుకు తాను మరణించినట్లుగా డ్రామా క్రియేట్ చేసి, తన పోలికలతో ఉన్న మరో వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితుడితో సహా అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, తన మాట వినడం లేదని తల్లిదండ్రులు కూతుర్లను చంపేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కుమర్తె ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆమెను, ఆమె లవర్‌ని ఘోరంగా హత్య చేశాడు.
Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఒంటరిగా ఆడవాళ్లు కనబడితే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో 26 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పాటు మరో కీలక నిందితుడు ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Uttar Pradesh: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠినమైన అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో తెలిసిన వ్యక్తుల నుంచే అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదేళ్ల బాలికపై పొరుగున ఉండే టీనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
DGP Ravi Gupta: తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఇయర్ అండ్ రివ్యూను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు, మీడియా సహకారంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని, ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 17.59 శాతం పెరిగాయి. ఈ ఏడాది 1108లో…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దామోహ్ జిల్లాలో జరిగింది. అవమానం భరించలేక బాలిక ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దామోహ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గరిమా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మైనర్ బాలిక తల్లిదండ్రులు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయటకు వెళ్లారు.
Chennai: తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతుల్ని కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దళంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే నిందితులు ముగ్గురు, అతడినిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడి మరణానికి అతని భార్యే కారణమని పగ పెంచుకున్న వ్యక్తి ఆమెకు నిప్పటించి చంపాడు. ఈ ఘటన రత్లాం జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తామామలు, ఆమె బావ మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు. నిర్మల అనే బాధితురాలు తీవ్రంగా కాలిన గాయాలతో మరణించారు.