Kolkata: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో (శుక్రవారం) ఆరో రోజుకు చేరుకుంది.
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
Bengaluru: బెంగళూర్‌లో ఓ విచిత్రమైన దొంగతనాలు బయటపడ్డాయి. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ‘‘పావురాలను’’ ఉపయోగించడం సంచలనంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడానికి దొంగ పావురాలను వాడుకుంటున్నాడే విషయం తెలిసి బెంగళూర్ సిటీ మార్కెట్ పోలీసులు షాక్ అయ్యారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు మేదినిపూర్‌లో ఓ నిందితుడు పొరుగించిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలిని పటాష్‌పూర్‌లోని నిందితుడి పక్కింటిలో ఉన్న మహిళగా గుర్తించారు. ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బలవంతంగా విషం తాగించాడు.
Gujarat: గుజరాత్ వడోదరలో దారుణం జరిగింది. తన ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజ్ యువతిపై గుర్తుతెలియన వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె స్నేహితుడిని అడ్డుకున్న దుండగులు బాలికపై అత్యాచారం చేశారని శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటన నవరాత్రి సందర్భంగా గర్భా ఈవెంట్ కోసం నగరానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు జరిగింది.
Delhi Doctor Murder: ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా నర్సుగా పనిచేస్తున్న తన భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భర్త, ప్లాన్ ప్రకారం మైనర్లతో డాక్టర్ని హత్య చేయించాడు. ఇందులో సంచలన విషయం ఏంటంటే.. నిందితుల్లో ఒకరైన మైనర్కి తన కూతురిని ఇచ్చి వివాహం చేయిస్తానని మహిళా నర్సు భర్త హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.