ఓ యువకుడితో ప్రేమలో ఉన్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా సదర్ కొత్వాలి మంఝన్పూర్ ప్రాంతంలోని తేజ్వాపూర్ గ్రామంలో 5 రోజుల క్రితం బావిలో తలలేని ఓ టీనేజ్ బాలిక మృతదేహం లభ్యమైంది.
Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక…
Bihar: బీహార్ రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిలో ఒక వ్యక్తి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. నర్హత్ గ్రామంలోని కాంగ్రెస్ నేత నీతూ కుమార్ ఇంట్లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు పీయూష్ సింగ్ గా గుర్తించారు. డెడ్ బాడీ దొరికిన సమయంలో ఎమ్మెల్యే నీతూ కుమార్ ఇంట్లో లేరని తెలిపారు.
Delivery Boy: నోయిడాలో దారుణం జరిగింది. సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్, ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు లొంగిపోతున్నట్లు నటిస్తూ.. పిస్టల్ తీసుకుని పరారయ్యాడు. పోలీసులు అతికష్టం మీద నిందితుడి కాలుపై ఫైర్ చేసి పట్టుకున్నారు.
breaking news: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపాపేట్ లోని రాజీ రెడ్డి నగర్ లో మిస్టరీగా మారిన యువతి హత్య కేసు వివిధ ట్విష్టుల అనంతరం మిస్టరీని చేధించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. నిన్న ఉదయం 11:30 గంటలకు చంపాపేట్ లోని రాజీ రెడ్డి నగర్ లో స్వప్న అనే యువతి ఇంట్లోనే హత్య చేయబడింది. కాగా ఆమె భర్త ప్రేమ్ రెండవ అంతస్థు పైన నుండి కింద పడగా అతన్ని ఉస్మానియా…
Hyderabad: నిన్న ఉదయం హైదరాబాద్ లోని చంపాపేట్ లో జరిగిన స్వప్న అనే యువతీ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపధ్యంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. స్వప్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మృతిచెందిన స్వప్న అనే యువతి గతంలోసతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు…
USA: అమెరికాలో ఓ మహిల దారుణ హత్యలకు పాల్పడింది. శృంగారం కోసం వచ్చే పురుషుల్ని చంపేసింది. రెబెక్కా ఆబోర్న్ అనే 33 ఏళ్ల మహిళ, పురుషులతో సెక్స్ తర్వాత వారికి ప్రాణాంతక మత్తుపదార్థాలు ఇచ్చి చంపేసేది, ఆ తరువాత వారిని దోచుకునేది. ఇలా నలుగురిని హత్యలు చేసిన రెబెక్కాపై పోలీసులు బుధవారం అభియోగాలు మోపారు.
Uttar Pradesh: దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన అత్యాచార చట్టాలు ఉన్నా కామాంధులు, మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Hyderabad: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపా పేట లోని రాజీ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ హత్య మిస్టరీగా మారింది. వివరాలలోకి వెళ్తే.. చంపా పేట రాజిరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో స్వప్న(24) ప్రేమ్(25) అనే దంపతులు ఉంటున్నారు. కాగా వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి రోజు గుర్తు తెలియని వ్యక్తులు వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కూడా యువతి యువకుడిని పలు…
Nellore: రోజు రోజుకి మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. మంచి చెడులకు మధ్య వ్యత్యాసాన్ని విస్మరించి మృగంలా మారుతున్నాడు. శారీరక వాంఛలతో దారుణాలకు ఒడిగడుతున్నాడు. క్షణకాల సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కొందరు మానవ మృగాలు. వావివరసలు మర్చిపోతున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వదిన అంటే అమ్మ తరువాత అమ్మలాంటిది అంటారు. అందుకే అన్న భార్యను వదినమ్మ అని పిలుస్తారు. అయితే అలాంటి వదిన…