నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు అంబటి రాయుడు.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను.. ధన్యవాదాలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.