టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా.. ఈరోజు మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అశ్విన్‌కు 100వ టెస్టు క్యాప్‌ను అందజేశాడు. అశ్విన్ తన 100 టెస్ట్ సందర్భంగా.. భార్య ప్రీతి నారాయణ్, తన ఇద్దరు కూతుళ్లు ధర్మశాలకు వచ్చారు. క్యాప్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్‌కు తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. భారత ఆటగాళ్లు ఇరువైపు…