వెస్టిండీస్ టీంలోని ఓ స్టార్ క్రికెటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వారం గయానాకు చెందిన కైటూర్ న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక టీనేజర్‌తో సహా 11 మంది మహిళలు ఆ క్రికెటర్‌పై లైంగిక నేరాల ఆరోపణలు చేశారు. ఈ అభియోగాలపై ఇంకా కేసు నమోదు కాలేదు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఒక షాకింగ్ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నాడని, దీనిపై అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను కూడా టార్గెట్ చేస్తూ అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయడానికి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని…
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది.