భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి కారణం.. హ్యాండ్‌షేక్. ఎందుకంటే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. శివం దుబేతో కలిసి కెప్టెన్ సూర్య పాకిస్థాన్ జట్టును పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 'హ్యాండ్ షేక్ వివాదం' అంశాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ముందు లేవనెత్తింది.