2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యాజమాన్యాన్ని కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ జట్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంపిక చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.