ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్‌లో 36వ సెంచరీ.