సీఆర్డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.. అయితే, హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్… హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలి? సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా? వద్దా? అనే విషయాలపై సమాలోచనలు చేశారు.. అయితే, ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేవారు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లాలా..? లేదా..? అని ఆలోచన చేస్తామన్న ఆయన.. అయినా…
సీఆర్డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది.. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా తీర్పు ఇచ్చింది. అధికారం లేనప్పుడు సీఆర్‌డీఏ చట్టం రద్దు కూడా కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి…
అమరావతి : సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించింది ప్రభుత్వం. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును పెట్టారు మంత్రి బుగ్గన. ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు…